Thursday, January 23, 2025

పంజాబ్ చిత్తు.. లక్నోకు ఆరో విజయం..

- Advertisement -
- Advertisement -

IPL 2022: LSG Win by 20 runs Against PBKS

పుణె: ఐపిఎల్‌లో కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ఆరో విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లక్నో బౌలర్లు సఫలమయ్యారు. మోసిన్ ఖాన్ మూడు, చమీరా, కృనాల్ రెండేసి వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక పంజాబ్ జట్టులో బెయిర్‌స్టో(32), కెప్టెన్ మయాంక్ అగర్వాల్(25), రిషి ధావన్ 21(నాటౌట్) మాత్రమే కాస్త రాణించారు. ఇక అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను డికాక్ (46), దీపక్ హుడా (34) ఆదుకున్నారు.

IPL 2022: LSG Win by 20 runs Against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News