Monday, January 20, 2025

చెన్నైపై లక్నో సూపర్ విక్టరీ..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 19.3 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (40), డికాక్ (61)లు శుభారంభం అందించారు. చివర్లో ఎవిన్ లూయిస్ 23 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో అజేయంగా 55 పరుగులు చేసి లక్నోకు విజయం అందించాడు.
ఉతప్ప మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) రనౌటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మోయిన్ అలీతో కలిసి మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ధాటిగా ఆడిన ఉతప్ప 27 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. మరోవైపు మోయిన్ అలీ 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఇక శివమ్ దూబే కూడా మెరుపులు మెరిపించాడు. చెలరేగి ఆడిన దూబే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 49 పరుగులు సాధించాడు. రాయుడు (27), కెప్టెన్ రవీంద్ర జడేజా (17), ధోనీ 16 (నాటౌట్) కూడా తమవంతు పాత్ర పోషించడంతో చెన్నై స్కోరు 210 పరుగులకు చేరింది.

IPL 2022: LSG Win by 6 Wickets against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News