Friday, December 20, 2024

కోల్‌కతా చిత్తు.. ప్లేఆఫ్‌కు రాహుల్ సేన!

- Advertisement -
- Advertisement -

పుణె: ఐపిఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకొంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకొంది. అంతేగాక ప్లేఆఫ్ బెర్త్‌ను కూడా సొంతం చేసుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్(56), దీపక్ హుడా(41), స్టోయినిస్ (28) జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డికాక్ 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 14.3 ఓవర్లలోనే కేవలం 101 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది. లక్నో బౌలర్లు అవేశ్ ఖాన్, హోల్డర్ మూడేసి వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించారు.

IPL 2022: LSG Win by 75 Runs Against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News