Friday, December 20, 2024

గుజరాత్ పై ముంబై సంచలన గెలుపు..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఐదు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. చివరి ఓవర్‌లో విజయం కోసం 9 పరుగులు చేయాల్సిన గుజరాత్ అనూహ్య ఓటమిని చవిచూసింది. డానిల్ షమ్స్ ఆఖరి ఓవర్‌లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ (45), రోహిత్ (43) రాణించారు. టిమ్ డేవిడ్ 44 (నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

IPL 2022: MI Win by 5 Runs against GT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News