Friday, December 20, 2024

ఢిల్లీకి ముంబై చెక్… ప్లేఆఫ్‌కు బెంగళూరు

- Advertisement -
- Advertisement -

ముంబై: నాకౌట్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఈ పరాజయంతో ఢిల్లీ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. 16 పాయింట్లతో బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా(24), కెప్టెన్ రిషబ్ పంత్(39), రొమాన్ పొవెల్(43) మాత్రమే రాణించారు. బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 సిక్సర్లు, మూడు ఫోర్లతో 48 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టిమ్ డేవిడ్ 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో వేగంగా 34 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు.

IPL 2022: MI Win by 5 wickets against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News