Wednesday, January 22, 2025

ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ తొలి విజయం నమోదు చేసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఐదు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. వరుసగా 8 మ్యాచుల్లో ఓడిన రోహిత్ సేనకు ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. చెలరేగి ఆడిన బట్లర్ 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 51 పరుగులు సాధించాడు. తిలక్‌వర్మ(35), టిమ్ డేవిడ్ 20(నాటౌట్) తమవంతు సహకారం అందించారు.

IPL 2022: MI Win by 5 Wickets against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News