Wednesday, January 1, 2025

గుజరాత్ టైటాన్స్‌కు చెక్..

- Advertisement -
- Advertisement -

IPL 2022: PBKS Win by 8 wickets against GT

గుజరాత్ టైటాన్స్‌కు చెక్
ఏనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ విజయం
ముంబై: గుజరాత్ విజయాల పరంపరకు పంజాబ్ కింగ్స్ చెక్ పెట్టింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ సమష్టిగా రాణించి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. శిఖర్ ధవన్ 53 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, భానుక రాజపక్షా(40), లియామ్ లివింగ్‌స్టోన్(30)లు చెలరేగారు. దీంతో గుజరాత్ నిర్ణయించిన 143 పరుగుల లక్షాన్ని రెండు వికెట్లు కోల్పోయి, నాలుగు ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. దీంతో ఈ ఈగ్‌లో పంజాబ్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, ఫెర్గుసన్ చెరో వికెట్టు పడగొట్టారు. కాగా, గుజరాత్ ఇప్పటికే ప్లేదఫ్‌కు చేరుకోగా పంజాబ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

IPL 2022: PBKS Win by 8 wickets against GT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News