Tuesday, January 21, 2025

అదరగొట్టిన బెంగళూరు.. ప్లేఆఫ్ అశలు సజీవం

- Advertisement -
- Advertisement -

IPL 2022: RCB Win by 8 wickets against GT

ముంబై: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో చాలెంజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం అందుకుంది. కోహ్లి (73), డుప్లెసిస్ (44), మాక్స్‌వెల్ 40 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు.

IPL 2022: RCB Win by 8 wickets against GT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News