Thursday, January 23, 2025

సెంచరీతో కదం తొక్కిన బట్లర్… రాజస్థాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

IPL 2022: RR Win by 23 runs against MI

కదం తొక్కిన బట్లర్.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం
హెట్‌మెయిర్ మెరుపులు, రాణించిన బౌలర్లు
ముంబై: ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగుల మాత్రమే చేసి పరాజయం పాలైంది. ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. మరోవైపు రాజస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆంరభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(10) తక్కువ స్కోరే ఔటయ్యాడు. కొద్ది సేపటికే అన్మోల్‌ప్రీత్ సింగ్(5) కూడా ఔటయ్యాడు. అయితే తెలుగుతేజం తిలక్‌వర్మతో కలిసి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను కదుట పరిచాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును లక్షం దిశగా నడిపించారు. తిలిక్ అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. 33 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 61 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారిన తిలక్‌ను రవిచంద్రన్ అశ్విన్ వెనక్కి పంపాడు. ఇక ఇషాన్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు చేశాడు. పొలార్డ్(22) తప్ప మిగతావారు విఫలం కావడంతో ముంబై స్కోరు 170 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు.
బట్లర్ శతకం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ను ఓపెనర్ జోస్ బట్లర్ ఆదుకున్నాడు. యశస్వి జైస్వాల్ (1), దేవ్‌దుత్ పడిక్కల్(7) విఫమయ్యారు. అయితే కెప్టెన్ సంజు శాంసన్ అండతో బట్లర్ చెలరేగి పోయాడు. శాంసన్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 30 పరుగులు చేశాడు. ఇక హెట్‌మెయిర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హెట్‌మెయిర్ 14 బంతుల్లోనే మూడు సిక్సర్‌లు, 3 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఇక అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన బట్లర్ 68 బంతుల్లోనే 11 ఫోర్లు, మరో ఐదు సిక్సర్లతో 100 పరుగులు సాధించాడు. దీంతో రాజస్థాన్ భారీ స్కోరును నమోదు చేసింది.

IPL 2022: RR Win by 23 runs against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News