Monday, November 18, 2024

లక్నోపై రాజస్థాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముంబయి: లక్నోతో జరిగిన మరో మ్యాచ్‌లో రాజస్థాన్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయానికి 179 పరుగులు చేయాల్సిన లక్నో కీలక దశలో వికెట్లు చేజార్చుకోవడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. దీపక్ హుడా ఒక్కడే అర్ధ సెంచరీ చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ,మెక్‌కాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా చాహల్, అశ్విన్‌లు చెరో వికెట్ సాధించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోగా, లక్నో మూడో స్థానానికి దిగజారింది.అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.యశస్వి జైస్వాల్ 41, దేవదత్ పడిక్కల్ 39, సంజూ శాంసన్ 32, రియాన్ పరాగ్ (17), నీషమ్ 14 పరుగులు చేయగా అశ్విన్ 10, ట్రెంట్ బౌల్ట్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

IPL 2022: RR Win by 24 runs against LSG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News