Thursday, January 23, 2025

మళ్లీ బెంగళూరు చిత్తు..

- Advertisement -
- Advertisement -

IPL 2022: RR Win by 29 runs against RCB

పుణె: ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 29 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు సమష్టి ప్రతిభతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక బెంగళూరు మరో ఓటమిని మూటగట్టుకుంది. విరాట్ కోహ్లి(9) మరోసారి నిరాశ పరిచాడు. కెప్టెన్ డుప్లెసిస్(23), మాక్స్‌వెల్(0), దినేశ్ కార్తీక్(6), ప్రభుదేశాయి(2) కూడా విఫలమయ్యారు. దీంతో బెంగళూరుకు నాలుగో ఓటమి తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను రియాన్ పరాగ్ ఆదుకున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (8) ఈసారి నిరాశ పరిచాడు. పడిక్కల్(7), డారిల్ మిఛెల్(16), అశ్విన్(17) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. కెప్టెన్ శాంసన్(27), పరాగ్ 56 (నాటౌట్) జట్టును ఆదుకున్నారు. దీంతో రాజస్థాన్ స్కోరు 144 పరుగులకు చేరింది. ఇక ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

IPL 2022: RR Win by 29 runs against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News