ముంబై: ఐపిఎల్‌లో లీగ్ దశను రాజస్థాన్ రాయల్స్ విజయంతో ముగించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ విజయంతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (2) నిరాశ పరిచాడు. కెప్టెన్ సంజు శాంసన్ (15) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. కానీ చివర్లో రవిచంద్రన్ అశ్విన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ 23 బంతుల్లో 3 సిక్సర్లు, రెండు ఫోర్లతో అజేయంగా 40 పరుగులు చేశాడు. అతనికి రియాన్ పరాగ్ 10(నాటౌట్) అండగా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైను మోయిన్ అలీ ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మోయిన్ 57 బంతుల్లోనే 3 సిక్సర్లు, మరో 13 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. అతనికి ధోనీ (26), కాన్వే (16) అండగా నిలిచారు.
IPL 2022: RR Win by 5 wickets against CSK