Monday, December 23, 2024

హైదరాబాద్‌కు కీలకం

- Advertisement -
- Advertisement -

IPL 2022: SRH vs DC Match Today

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు నెలకొంది. ఇక హైదరాబాద్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయాలు అందుకుంది. మరోవైపు ఢిల్లీ నాలుగు మ్యాచుల్లోనే గెలిచి ఐదింటిలో ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్ ఢిల్లీకి కూడా కీలకంగా తయారైంది.
అందరి దృష్టి వార్నర్‌పైనే..
ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. కిందటి సీజన్ వరకు వార్నర్ సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం హైదరాబాద్ తరఫున ఆడిన వార్నర్ ఈసారి కొత్త జట్టులో చేరాడు. అతనిపై సన్‌రైజర్స్ యాజమాన్యం పెద్దగా ఆసక్తి చూపించలేదు. కిందటి సీజన్‌లో వార్నర్‌ను కెప్టెన్‌గా తొలగించిన సన్‌రైజర్స్ యాజమాన్యం చివరికి తుది జట్టులో కూడా చోటు కల్పించలేదు. అంతేగాక ఎంతో కీలకమైన వార్నర్‌ను అట్టి పెట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో వార్నర్ మెగా వేలం పాటలో పాల్గొని ఢిల్లీ జట్టుకు ఎంపికయ్యాడు. కాగా, పాత జట్టుపై వార్నర్ ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సీజన్‌లో వార్నర్ నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. హైదరాబాద్‌పై కూడా అదే జోరును కనబరిచి తానెంటో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్, పృథ్వీషా, పొవెల్, శార్దూల్, మిఛెల్ మార్ష్ తదితరులతో ఢిల్లీ బలంగా ఉంది. కుల్దీప్, అక్షర్, ముస్తఫిజుర్, శార్దూల్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఢిల్లీని తక్కువ అంచనా వేయలేం.
సవాల్ వంటిదే..
ఇక హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ కీలకమనే చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడడంతో సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం కొత్త దెబ్బతింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా మళ్లీ గాడిలో పడాలనే పట్టుదలతో టీమ్ కనిపిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, విలియమ్సన్‌లు ఫామ్‌లో ఉన్నారు. అయితే కొన్ని మ్యాచ్‌లుగా రాహుల్ త్రిపాఠి వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్‌క్రామ్, పూరన్ తదితరులతో బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతేగాక ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్, జాన్సన్, నటరాజన్ వటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IPL 2022: SRH vs DC Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News