Friday, December 20, 2024

నేటితో లీగ్ దశకు తెర..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ సీజన్15 ముగింపు దశకు చేరుకొంది. ఆదివారంతో లీగ్ దశకు తెరపడనుంది. ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఆఖరి మ్యాచ్ ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే చివరి మ్యాచ్‌లో గెలిచి లీగ్ దశను ముగించాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే బరిలోకి దిగనుంది. కేన్ ఇప్పటికే న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అతను లేకపోవడంతో ఆఖరి మ్యాచ్‌లో ఎవరూ కెప్టెన్సీ చేపడుతారో తేలడం లేదు. భువనేశ్వర్ లేదా పూరన్‌లలో ఒకరు సారథ్యం వహించే అవకాశం ఉంది.

ఇక ఈ సీజన్ ఆరంభంలో ఇటు పంజాబ్ అటు హైదరాబాద్ నిలకడైన విజయాలు సాధించాయి. కీలకమైన చివరి దశలో మాత్రం రెండు జట్లు వరుస ఓటములతో సతమతమయ్యాయి. దీంతో నాకౌట్‌కు చేరడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం ఇరు జట్లు ఆరేసి విజయాలు సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు 14 పాయింట్లతో మరింత మెరుగైన స్థితిలో నిలిచే అవకాశాలుంటాయి. ఇలాంటి స్థితిలో ఇరు జట్లు కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి.

IPL 2022: SRH vs PBKS Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News