Thursday, January 23, 2025

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐపిఎల్‌లో భాగంగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె), రాజస్థాన్ జట్ల మధ్య పోరు జరుగనుంది. సిఎస్‌కె కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో రెండేసి విజయాలు సాధించాయి. ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన చెన్నై ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. రాజస్థాన్ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News