Wednesday, January 22, 2025

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగే పోరుకు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ లో సిఎస్ కె టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మొదట బ్యాటింగ్ చేయనుంది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక పోరులో హైదరాబాద్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో చెన్నై మ్యాచ్ హైదరాబాద్‌కు చావోరేవోగా తయారైంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ హైదరాబాద్ కచ్చితంగా గెలవాల్సిందే. ఇక సొంత గడ్డపై ఆడుతున్న చెన్నైకి కూడా ఈ మ్యాచ్ కీలకమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News