Saturday, December 28, 2024

రహానె మెరుపులు.. కోల్‌కతాపై చెన్నై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్ డబుల్ హెడర్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. కోల్‌కతాపై 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అజింక్య రహానె, కాన్వే, శివందుబె హాఫ్‌సెంచరీలతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరికి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 35పరుగులతో తనవంతు సహకారాన్ని అందించాడు. మొత్తంమీద ధోనీ సేన నిర్ణీత 4వికెట్లుకు 235పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం నిర్దేశించిన విజయలక్ష కోల్‌కతా 20ఓవర్లలో 8వికెట్లకు 186 పరుగులు చేసి తేడాతో ఓటమిపాలైంది.

కాగా కోల్‌కతా గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకుని చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిణ చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 4వికెట్ల నష్టానికి భారీ స్కోరు సాధించింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 20బంతుల్లో 35పరుగులు, కాన్వే 4ఫోర్లు, 3సిక్స్‌లతో 56పరుగులు, రహానే 6ఫోర్లు, 5సిక్స్‌లతో 71పరుగులు, శివందూబె 2ఫోర్లు, 5సిక్స్‌లతో 50పరుగులు చేసి హాఫ్‌సెంచరీలతో సత్తా చాటారు. రవీంద్ర జడేజా చేయగా 2పరుగులుతో నాటౌట్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News