Monday, January 20, 2025

IPL 2023: మ్యాక్స్ వెల్, డుప్లెసిస్ పోరాటం వృథా.. ఆర్‌సిబిపై చెన్నై విజయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బెంగళూరు కూడా దీటైన జవాబిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

కెప్టెన్ ఫా డుప్లెసిస్ 33 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మాక్స్‌వెల్ 36 బంతుల్లోనే 8 సిక్సర్లు, 3 బౌండరీలతో 76 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరూ కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైను ఓపెనర్ డెవోన్ క్వానే ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన కాన్వే 6 సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 83 పరుగులు చేశాడు. శివమ్ దూబే (52), రహానె (37) కూడా మెరుపులు మెరిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News