Monday, December 23, 2024

IPL 2023: గుజరాత్‌కు షాక్.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయం నమోదు చేసింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఐదు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన మ్యాచ్‌లో ఢిల్లీ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

అక్షర్ పటేల్ (27), అమన్ హకీం ఖాన్ (51), రిపాల్ పటేల్ (23) మాత్రమే రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసి విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లు సమష్టి ప్రదర్శనతో జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News