Monday, December 23, 2024

పంజాబ్‌పై ఢిల్లీ గెలుపు

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. ఢిల్లీ ఇప్పటికే నాకౌట్ రేసునుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (46), పృథ్వీషా (54)లు ఢిల్లీకి శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రొసొ 37 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో 6 ఫోర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ సాల్ట్ 26 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 94 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News