Thursday, January 23, 2025

బెంగళూరుపై ఢిల్లీ ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లి (55), డుప్లెసిస్ (45), మహిపాల్ లొమ్రోర్ (54) పరుగులు చేశారు.

ఈ క్రమంలో కోహ్లి ఐపిఎల్‌లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఫిలిప్ సాల్ట్ (87), వార్నర్ (22), రొసొ 35 (నాటౌట్) ఢిల్లీని గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News