Monday, December 23, 2024

IPL 2023: 28 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి గుజరాత్ బౌలర్ మహ్మద్ షమీ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్లో తొలి బంతికే ఓపెనర్ ఫిలిప్(0)ను డకౌట్ చేశాడు.

ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన షమీ వచ్చిన బ్యాట్స్ మెన్లను వచ్చినట్లే పెవిలియన్ పంపి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. షమీ దెబ్బకు ప్రియామ్ గార్గ్(10), మనీష్ పాండే(01), రిలీ రోసోవ్(08), డేవిడ్(02) దీంతో ఢిల్లీ ఆరు ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(2), హకీమ్ ఖాన్(4)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News