Monday, December 23, 2024

IPL 2023: గుజరాత్ పై బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరుగనుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా గుజరాత్ బౌలింగ్ చేయనుంది.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీలకంగా మారింది. గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఢిల్లీ వరుస ఓటములతో అట్టడుగు స్థానంలో నిలిచింది. గుజరాత్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీకి ఈ పోరు సవాల్‌గా తయారైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News