అహ్మదాబాద్ : ఐపిఎల్2023 సీజన్‌ను ఓటములతో ఆరంభించింది ముంబయి. ఆర్‌సిబి, చెన్నై చేతిలో వరుసగా ఓటమిపాలైంది. ఆ తర్వాత పుంజుకుని హ్యాట్రిక్ విజయం సాధించింది. అలా చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి.. నాలుగో జట్టుగా క్వాలిఫయర్‌లోకి అడుగుపెట్టింది. అలా టైటిల్ సాధించిన ఐదు సందర్భాల్లో నాలుగుసార్లు సీజన్‌లను ఓటములతోనే ఆరంభించింది. ఇదిలా ఉండగా గుజరాత్ వరుస గెలుపులతో 18 పాయింట్లతో నకౌట్ చేరింది.
వరుస విజయాలతో లీగ్ దశలో పెను ప్రకంపనలు సృష్టించిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ మొదటి క్వాలిఫైరయ్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో చిత్తుగా ఓడి క్వాలిఫయర్ రెండో మ్యాచ్‌లో ముంబైతో అమీతుమికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండోసారి కప్ కొట్టాలనే యోచనలో ఉంది గుజరాత్. ఇప్పటికే ఐదు సార్లు టైటిల్ నెగ్గిన ముంబై ఆరో టైటిల్‌నూ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. కాగా, ఏ జట్టు గెలిచినా ఫైనల్లో చెన్నైతో తలపడనుంది.
సూర్యకుమార్‌పైనే అందరి కళ్లూ
ఇక ఈ సీజన్‌లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్‌తో నిరాశ పరుస్తూ వచ్చినా గత రెండు మ్యాచ్‌లో నిలకడగా రాణించాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లోనూ సూ ర్యకుమార్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. కిందటి సీజన్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన సూర్యకుమార్ ఈసారి మాత్రం ఆ స్థాయి ఆటను కనబరచలేక పోతున్నాడు. అతని వైఫల్యం ముంబైని వెంటాడుతోం ది. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా సూర్య తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్త మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్ చెలరేగితే ముంబైకి ఎదురే ఉండదు. ఇక టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, నెహాల్ వధెరా తదితరులతో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతేగాక గ్రీన్, అర్జున్, మెరెడిథ్, చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్ వం టి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ లో ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
జోరుమీదున్న టైటాన్స్
తొలి క్వాలిఫయర్‌లో ఓడినా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలు జోరుమీదున్నారు. కిందటి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అజేయ శతకంతో కదం తొక్కాడు. ఈ సీజన్‌లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. లీగ్ దశలో రెండు శతకాలు బాది సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. విజయ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కెప్టెన్ హార్దిక్ పాండ్య తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షమి, రషీద్, శనక, నూర్ అహ్మద్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది.