- Advertisement -
అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇది ఐదో విజయం కావడం విశేషం. ఇక ముంబై ఇండియన్స్‌క ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(56) పరుగులు చేశాడు.
ఇక డేవిడ్ మిల్లర్ (46), మనోహర్ (42), రాహుల్ తెవాటియా(20నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
- Advertisement -