Tuesday, March 4, 2025

IPL 2023: ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ గెలుపు..

- Advertisement -
- Advertisement -

మొహాలి: ఐపిఎల్ 2023 లీగ్ లో భాగంగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌ జట్టు గెలుపొందింది. పంజాబ్ కింగ్స్‌ నిర్ధేశించిన 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్, పంజాబ్ పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్(67) అర్థ శతకంతో రాణించాడు. మరో ఓపెనర్ సాహ(30), డేవిడ్ మిల్లర్(17 నాటౌట్) రాణించారు. దీంతో మరో బంతి మిగిలుండగానే గుజరాత్ విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (36), రాజపక్స(20), వికెట్ కీపర్ జితేశ్ శర్మ (25), శామ్ కరన్ (22), షారుక్ ఖాన్ (22) పరుగులు సాధించారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మొహిత్ శర్మ, రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News