Sunday, November 24, 2024

సన్‌రైజర్స్ ఔట్… ప్లేఆఫ్‌కు గుజరాత్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ ప్లే ఆఫ్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. సోమవారం గుజరాత్ టైటాన్స్ 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో గుజరాత్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో నాకౌట్ బెర్త్‌ను అందుకున్న తొలి టీమ్‌గా కూగా గుజరాత్ నిలిచింది. తొలుత బ్యాటిగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్ సింగ్ (5), అభిషేక్ శర్మ (4) శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. కెప్టెన్ మార్‌క్రమ్ (10), రాహుల్ త్రిపాఠి (1), సన్వీర్ సింగ్ (7), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ (64) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతనికి భువనేశ్వర్ కుమార్ (27) అండగా నిలిచాడు. మిగతా వారిలో మర్కండే 18 (నాటౌట్) ఒక్కడే కాస్త రాణించాడు.

గిల్ శతకం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో ఆదుకున్నాడు. అతనికి సాయి సుదర్శన్ అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ 58 బంతుల్లోనే 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. సుదర్శన్ (47) పరుగులు సాధించాడు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News