మోహిత్ మెరుపు దాడి
లక్నోపై 7పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్
ప్లేయర్ ది మ్యాచ్ మోహిత్ శర్మ
లక్నో: జరిగిన డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరిత విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7పరుగుల తేడాతో గెలుపొందింది. స్వల్ప లక్ష ఛేదనలో జెయింట్స్ తడబాటుకు గురై గెలుపు ముంగిట చతికిలపడ్డారు. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని ఓవర్లలో 6వికెట్ల నష్టానికి నామమాత్రపు స్కోరు నమోదు చేసింది. టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్య 2ఫోర్లు, 4సిక్స్‌లతో 66పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా దిగిన వికెట్ కీపర్ సాహా 6ఫోర్లుతో 47పరుగులు చేసి సహకరించగా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. స్వల్పస్కోరుకే పరిమితమయ్యారు. గిల్ (0), అభినవ్ మనోహర్ (3), విజయ్ శంకర్ (10), మిల్లర్ (6) నిరాశపరిచారు. అనంతరం నిర్దేశించిన 136పరుగుల లక్ష ఛేదనలో లక్నో 7వికెట్లకు 128పరుగుల స్కోరు వద్ద నిలిచిపోయింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 61బంతుల్లో 8ఫోర్లుతో 68 పరుగులు సాధించి హాఫ్‌సెంచరీతో పోరాడినా ఓటమి తప్పలేదు. రాహుల్‌తోపాటు స్టొయినిస్‌ను పెవిలియన్‌కు పంపి లక్నో విజయాన్ని అడ్డుకున్న ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కేఎల్ రాహుల్ సెంచరీ వృథా
షమీ, మోహిత్‌శర్మ అత్యుత్తమ డెత్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకం విజయాన్ని అందించలేకపోయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఆతిథ్య జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. లక్ష ఛేదనలో రాహుల్ దూకుడుగా ఆడాడు. మూడో ఓవర్ నుంచి విజృంభించాడు. షమీ బౌలింగ్‌లో వరుసుగా మూడుసార్లు బంతిని బౌండరికి తరలించాడు. అనంతరం రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. కైల మేయర్స్ అండతో రాహుల్ చెలరేగిపోయాడు. దీంతో లక్నో 5.3ఓవర్లలోనే 50పరుగుల మైలురాయిని దాటింది. పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో జట్టు 53/0 పటిష్ఠస్థితిలో నిలిచింది. ఈ దశలో రాహుల్ 30పరుగులతో, మేయర్స్ 23పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఈ జోడీని విడదీసి బ్రేక్ ఇచ్చాడు. 19బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 24పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మేయర్స్‌ను ఔట్ చేశాడు. లక్నో 55పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. మరోవైపు రాహుల్ ధాటిగా ఆడుతుండగా పాండ్య క్రీజులో కుదురుకోవడానికి తీసుకున్నాడు. ఇన్నింగ్స్ సగం ముగిసేసరికి వికెట్ నష్టానికి స్కోరుతో గెలుపు దిశగా పయనించింది. ఈక్రమంలో రాహుల్ ఐపిఎల్‌లో 33వ అర్ధశతకం నమోదు చేశాడు. లక్నో 13.1ఓవర్లలో 100పరుగుల మార్కును దాటింది.
మోహిత్‌శర్మ విజృంభణ
16ఓవర్లు ముగిసేసరికి జట్టు 109/2స్కోరు నమోదు చేసింది. చివరి నాలుగో ఓవర్లలో 26పరుగులు అవసరం కాగా పూరన్ పేలవ ప్రదర్శనతో కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. నూర్ అహ్మద్ రెండో వికెట్‌ను తన వేసుకున్నాడు. 110పరుగుల వద్ద మూడో వికెట్ పడింది. మోహిత్‌శర్మ ఓవర్లో 6పరుగులిచ్చాడు. తర్వాత ఓవర్లో షమీ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 19.2ఓవర్లలో స్కోరు 126/4కు చేరగా చివరి నాలుగు బంతుల్లో 10పరుగులు అవసరమయ్యాయి.చివరి ఓవర్లో రెండో బంతికి రాహుల్ (68)ను ఔట్ చేసిన తర్వాత బంతికి స్టొయినిస్‌ను గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌కు పంపాడు మూడు బంతుల్లో విజయలక్షం 10పరుగులుగా నిలిచింది. ఈదశలో బదాని (8) రనౌట్ అయ్యాడు. మరుసటి బంతికె దీపక్ హుడా రనౌట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో లక్నో కథ ముగిసింది. మొత్తంమీద లక్నో జట్టు 20ఓవర్లలో 7వికెట్లకు 128పరుగులు చేసి ఓటమిపాలైంది.