Monday, December 23, 2024

IPL 2023: చెన్నైపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ 2023 సీజన్‌ శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో తలపడేందుకు గుజరాత్ టైటాన్స్‌-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు సిద్ధమయ్యాయి.

నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకుని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించారు. దీంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై 4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గ్వైక్వాడ్(23), మొయిన్ అలీ(04)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News