- Advertisement -
మొహాలి: ఐపిఎల్ 2023 లీగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టుకు ఆదిలోనే ఎదరుదెబ్బ తగిలింది.మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్(0) డకౌటయ్యాడు.
అనంతరం మరో ఓపెనర్ శిఖర్ ధావన్(8) కూడా పెవిలియన్ చేరడంతో పంజాబ్ ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మ్యాథ్యూ(36), రాజపక్సాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, వేగంగా ఆడేందుకు ప్రయత్నించి మ్యాథ్యూ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జితేశ్ శర్మ(25) కూడా ఔట్ కావడంతో పంజాబ్ 13 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. క్రీజులో రాజపక్సా(17), శామ్ కరన్(1)లు ఉన్నారు.
- Advertisement -