Wednesday, April 2, 2025

ఉత్కంఠ పోరులో కోల్‌కతాను గెలిపించిన రింకు..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా సోమవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (57) ఒక్కడే రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. కెప్టెన్ నితీశ్ రాణా (51), ఆండ్రీ రసెల్ (42), రింకు సింగ్ 21 (నాటౌట్) జట్టును ఆదుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News