Tuesday, November 5, 2024

IPL 2023: కోహ్లీ పోరాటం వృథా.. కోల్‌కతా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కెప్టెన్‌గా మరోసారి బెంగళూరు జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీకి నిరాశ తప్పలేదు. బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 37బంతుల్లో 6బౌండరీలతో 54పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా ఓటమి తప్పలేదు. కోల్‌కతా చేతిలో బెంగళూరు 21పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కోల్‌కతా నిర్దేశించిన 201పరుగుల లక్ష ఛేదనలో బెంగళూరు 8వికెట్ల నష్టానికి వద్ద నిలిచిపోయింది. దీంతో 21పరుగులతో ఆతిథ్య బెంగళూరుపై కోల్‌కతా జట్టు విజయం సాధించింది. ప్రధానంగా డుప్లెసిస్ (17), మ్యాక్స్‌వెల్ (5) విఫలమవడం ఆర్‌సిబి విజయవకాశాలను దెబ్బతీసింది.

కాగా బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంచుకుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 5వికెట్లకు 200పరుగులు చేసింది. ఓపెనర్ జెసన్ రాయ్ 29బంతుల్లో 4ఫోర్లు, 5సిక్స్‌లతో 56పరుగులు చేసి అర్ధశతకం నమోదు చేయగా, కెప్టెన్ నితీశ్ రాణా 21బంతుల్లో 3ఫోర్లు, 4సిక్స్‌లతో 48పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

వీరికి అయ్యర్ 31పరుగులతో తనవంతు సహకారాన్ని అందించాడు. రస్సెల్ కేవలం ఒక్క పరుగుకే సిరాజ్ బౌలింగ్ క్లీన్‌బౌల్డ్ అయి మరోసారి నిరాశపరిచాడు. రింకుసింగ్ 18, వీస్ 12పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3వికెట్లతో మెరవగా సుయాష్‌శర్మ, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టి బెంగళూరు ఓటమిని శాసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News