Sunday, January 19, 2025

సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ప్రతీకారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని చవిచూసింది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదు పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ విజయంతో కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమికి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా (42), రింకు సింగ్ (46), ఆండ్రి రసెల్ (24) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బ్యాటింగ్ వైఫల్యంతో జట్టుకు మరో ఓటమి తప్పలేదు.

ఓపెనర్లు అభిషేక్ శర్మ (9), మయాంక్ అగర్వాల్ (18) మరోసారి విఫలమయ్యారు. రాహుల్ త్రిపాఠి (20), హారీ బ్రూక్ (0)లు కూడా నిరాశ పరిచారు. హెన్రి క్లాసెన్ (36), ఐడెన్ మార్‌క్రమ్ (41)లు రాణించినా జట్టును గెలిపించలేక పోయారు. కోల్‌కతా బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో తమ జట్టుకు విజయం సాధించి పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News