Wednesday, January 22, 2025

కోల్‌కతాకు చావోరేవో.. నేడు చెన్నై ఢీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్‌ కింగ్స్ ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై అగ్రస్థానంతో పాటు ప్లేఆఫ్ బెర్త్‌ను సొంత చేసుకుంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సిఎస్‌కె చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను శాసించే బౌలర్లు, బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే, అజింక్య రహానె, మోయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోనీ, దీపక్ చాహర్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. రుతురాజ్, కాన్వే, రహానెలు ఫామ్‌లో ఉండడం చెన్నైకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి.

బౌలింగ్‌లోనూ చెన్నై చాలా బలంగా ఉంది. ఇదిలావుంటే కోల్‌కతాకు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. చెన్నై చేతిలోనూ ఓడితే నాకౌట్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి కోల్‌కతాకు నెలకొంది. ముంబై చేతిలో ఘోర పరాజయం పాలు కావడంతో కోల్‌కతా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి స్థితిలో చెన్నై వంటి బలమైన జట్టుతో జరిగే పోరు జట్టుకు సవాల్‌గానే చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News