Monday, December 23, 2024

ఇరు జట్లకు కీలకమే.. నేడు రాజస్థాన్‌తో కోల్‌కతా ఢీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో మాజీ విజేతలు రాజస్థాన్ రాయల్స్‌కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు నెలకొంది. ప్రస్తుతం ఇరు జట్లు ఐదేసి విజయాలతో ఉన్నాయి. మెరుగైన రన్‌రేట్ కలిగి ఉండడం రాజస్థాన్‌కు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేక పోతోంది. ప్రారంభంలో రాజస్థాన్ వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి పెను ప్రకంపనలు సృష్టించింది. కానీ తర్వాత ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓటమి పాలైంది.

వరుస ఓటములతో జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బాగానే ఉన్నా సమష్టిగా రాణించడంలో జట్టు విఫలమవుతోంది. ఇలాంటి స్థితిలో ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, దేవ్‌దుత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్, హెట్‌మెయిర్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉన్న రియాన్ పరాగ్ కూడా ధాటిగా ఆడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇలా బ్యాటింగ్‌లో రాజస్థాన్ బలంగానే కనిపిస్తోంది. మరోవైపు ట్రెంట్ బౌల్ట్, చాహల్, అశ్విన్, ఆడమ్ జంపాలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. అయితే నిలకడలేమీ రాజస్థాన్‌కు ప్రధాన ఇబ్బందిగా మారింది. దీన్ని అధిగమిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలుంటాయి. ఇక ఆతిథ్య కోల్‌కతాకు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కోల్‌కతా నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News