Thursday, April 3, 2025

IPL 2023: బోణీ కొట్టిన కోల్‌కతా.. ఆర్‌సిబిపై ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్ సీజన్16లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్జాబ్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు.

రింకు సింగ్ 46 (నాటౌట్), శార్దూల్ ఠాకూర్ 68 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. తర్వాత లక్షఛేదనకు దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి 15 పరుగులకే నాలుగు వికెట్లు తీశాడు. నరైన్ రెండు, సుయాష్ శర్మ మూడు వికెట్లు తీసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News