Thursday, January 23, 2025

IPL 2023: రెండు వికెట్లు కోల్పోయిన లక్నో..

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్ 2023 లీగ్ లో భాగంగా జైపూర్ వేదిగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నోను రాజస్థాన్ బౌలర్లు తొలి ఓవర్ నుంచే కట్టడి చేశారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగడంతో రాజస్థాన్ ఓపెనర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు.

ఈ క్రమంలో భారీ షాట్ కు యత్నించి కెఎల్ రాహుల్(39) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోని(01)ని ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. దీంతో 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్నో 86 పరుగులు చేసింది. క్రీజులో మేయర్స్(39), దీపక్ హుడా(02)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News