Sunday, January 19, 2025

IPL 2023: ఐదు వికెట్లు కోల్పోయిన కోల్​కతా..

- Advertisement -
- Advertisement -

కోల్​కతా: ఐపిఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లోకోల్​కతా నైట్ రైడర్స్ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్​కతాకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 26 పరుగుల వద్ద ఓపెనర్ వెంకటేష్ అయ్యర్(3), మన్ దీప్ సింగ్(0)లు ఔటయ్యారు.

తర్వాత నితీష్ రాణా(1) కూడా పెవిలియన్ చేరడంతో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కోల్​కతా ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులో వచ్చిన రింకు సింగ్ తో కలిసి మరో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్బాజ్(55) అర్థ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో పుంజుకుంటున్నట్లు కనిపించిన కోల్​కతా.. వెంటవెంటనే గుర్జాబ్, రస్సెల్(0)ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కోల్​కతా 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రింకు సింగ్(12), శార్దుల్ ఠాకూర్(5)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News