Monday, December 23, 2024

చేజేతులా ఓడిన ముంబై.. లక్నో ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో లక్నో నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

స్టోయినిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన స్టోయినిస్ 47 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 89 పరుగులు చేశాడు. కెప్టెన్ కృనాల్ పాండ్య (49) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (59), రోహిత్ శర్మ (37) శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News