Monday, December 23, 2024

IPL 2023: టాస్ గెలిచిన లక్నో.. చెన్నై బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపిఎల్)16వ సీజ‌న్ లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకుని.. ముందుగా చెన్నై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన చెన్నై జట్టు సొంత గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి టోర్నీలో బోణీ కొట్టాల‌నిప‌ట్టుద‌ల‌తో ఉంది. మరోవైపు తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఘన విజయం సాధించిన ల‌క్నో జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సత్తా చాటాలని చూస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News