Friday, December 27, 2024

IPL 2023: నేడు పంజాబ్‌తో లక్నో ఢీ

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచిన లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానానికి దూసుకెళ్లాలని భావిస్తోంది. పంజాబ్ కూడా సీజన్‌లో బాగానే ఆడుతోంది. గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చింది. ఇక లక్నోతో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే లక్షంతో కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. శిఖర్ ధావన్, రాజపక్స, జితేశ్ శర్మ, సామ్ కరన్, షారుక్ ఖాన్, మాథ్యూ షార్ట్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ బలంగా ఉంది.

అంతేగాక రిషి ధావన్, సామ్ కరన్, రబడా, అర్ష్‌దీప్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక లక్నోలో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. మేయర్స్, కెప్టెన్ రాహుల్, స్టోయినిస్, నికోలస్ పూరన్, బడోని, కృనాల్ పాండ్య, దీపక్ హుడా తదితరులతో లక్నో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ఉనద్కట్, అవేశ్ ఖాన్, మార్క్‌వుడ్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, కృనాల్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News