Monday, December 23, 2024

IPL 2023: ఉత్కంఠ పోరులో ముంబై విజయం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్ జట్టుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ(65), ఈషాన్ కిషన్(31)లు ధనాధన్ బ్యాటింగ్ తో అలరించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరితోపాటు తిలక్ వర్మ(41), టిమ్ డేవిడ్(13), గ్రీన్(17)లు రాణించారు.

ఫైనల్ ఓవర్లలో ముంబై విజయానికి 5 పరుగులే కావాల్సినా.. అన్రిచ్ నోర్ట్జే సూపర్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు. దీంతో ముంబై చివరి బంతి వరకూ పోరాడాల్సి వచ్చింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరి బంతికి రెండు పరుగులు తీసి ముంబై ఊపిరిపీల్చుకుంది. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించిన ముంబై టోర్నీలో బోణీ కొట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News