Saturday, December 21, 2024

ముంబై తీన్మార్.. బెంగళూరుపై 200 లక్ష్యాన్ని అలవోకగా చేధించింది..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరును సాధించింది.

డుప్లెసిస్ (65), మాక్స్‌వెల్ (68), దినేశ్ కార్తీక్ (30) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. ధాటిగా ఆడిన సూర్యకుమార్ 35 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 4 సిక్సర్లు, 4 ఫోర్లతో వేగంగా 42 పరుగులు సాధించాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నెహాల్ వధెరా 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News