Wednesday, January 22, 2025

సమరోత్సాహంతో ముంబై.. నేడు గుజరాత్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

ముంబై: వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. పటిష్టమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబై 200 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈ విజయం రోహిత్ సేన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇదే జోరును గుజరాత్‌పై కూడా కొనసాగించాలనే పట్టుదలతో ముంబై ఉంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ ఒక్కటే ముంబైని కలవరానికి గురిచేస్తోంది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ గాడిలో పడితే మాజీ ఛాంపియన్‌కు ఎదురే ఉండదు. ఇక అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. బెంగళూరుపై వీరిద్దరూ అద్భుతంగా ఆడారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కామెరూన్ గ్రీన్, నెహాల్ వధెరా, టిమ్ డేవిడ్ తదితరులతో ముంబై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బెహ్రాన్‌డార్ఫ్, గ్రీన్, పియూష్, జోర్డాన్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.

జోరుమీదుంది..
మరోవైపు గుజరాత్ కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే గుజరాత్‌కు ప్లేఆఫ్ బెర్త్ ఖాయమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక అల్జరీ జోసెఫ్, షమి, రషీద్, నూర్ అమ్మద్, మోహిత్ శర్మలతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News