Thursday, January 23, 2025

ఢిల్లీపై పంజాబ్ విజయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుత సెంచరీతో పంజాబ్‌ను ఆదుకున్నాడు. ఒంటరి పోరాటం చేసిన ప్రభ్‌సిమ్రాన్ 65 బంతుల్లోనే 6 సిక్సర్లు, పది ఫోర్లతో 103 పరుగులు చేశాడు. మిగతా వారు విఫలమయ్యారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు డేవిడ్, ఫిలిప్ సాల్ట్‌లు శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ వార్నర్ 54 పరుగులు చేశాడు. సాల్ట్ (21), హకీం ఖాన్ (16), ప్రవీణ్ దూబే (16) మాత్రమే కాస్త రాణించారు. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ నాలుగు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News