Monday, January 20, 2025

IPL 2023: పంజాబ్‌దే గెలుపు

- Advertisement -
- Advertisement -

ముంబై: శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ముంబయిపై పంజాబ్ జట్టు 13పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్లో అర్షదీప్ నిప్పులు చెలరేగే బౌలింగ్‌తో ముంబై విజయాన్ని అడ్డుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 8వికెట్లకు 214పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ సామ్‌కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో 29బంతుల్లో 55పరుగులుచేసి మెరిశాడు. అనంతరం నిర్దేశించిన లక్ష ఛేదనలో ముంబై 6వికెట్లుకు 201పరుగులు చేసి ఓటమిపాలైంది. గ్రీన్ (67), (57) హాఫ్‌సెంచరీలతో పోరాడినా పంజాబ్ గెలుపును అడ్డుకోలేకపోయారు. ముంబయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంచుకుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

పంజాబ్ టాపార్టర్ శుభారంభం అందించడంలో ఒకింత తడబాటుకు గురైనా మిడిలార్డర్ మెరవడంతో పంజాబ్ కింగ్స్ 214పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ 29బంతుల్లో 5ఫోర్లు, 4సిక్స్‌లతో 55పరుగులు చేసి అర్ధశతకంతో అలరించాడు. హర్‌ప్రీత్‌సింగ్ 28బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స్‌లతో 41పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. మొత్తంమీద పంజాబ్‌కింగ్స్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి చేసింది. ముంబై బౌలర్లలో చావ్లా, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీయగా బెహండ్రాఫ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు. పంజాబ్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో ముంబయి ఓటమి తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News