Friday, December 20, 2024

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా మరికాసేపట్లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇరు జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ప్రస్తుతం రెండు జట్లు నాలుగేసి విజయాలు సాధించాయి. అయితే మెరుగైన రన్‌రేట్ సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News