Friday, December 20, 2024

IPL 2023: రషీద్ ఖాన్ హ్యాట్రిక్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతాకు రషీద్ ఖాన్ షాకిచ్చాడు. 205 పరుగుల లక్ష్య చేధనలో కోల్ కతా బ్యాట్స్ మెన్లు దూకుడుగా ఆడడంతో ఆ జట్టు సునాయసంగా విజయం సాధిస్తుందనుకున్నారు.

అర్థ శతకంతో జోష్ మీదున్న వెంకటేష్ అయ్యర్(), నితిష్ రాణా(45)లు ఔట్ అయినా.. అప్పటికే కోల్ కతా భారీ స్కోరు సాధించడం, ఇంకా స్టార్ బ్యాట్స్ మెన్లు ఉండడంతో కోల్ కతా జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దశలో రషీద్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. ఒక్క ఓవర్ లోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. వరుస బంతుల్లో రస్సెల్(0), సునీల్ నరైన్(0), శార్దుల్ ఠాకూర్(0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించడమే కాకుండా కోల్ కతా ఆశలపై నీళ్లు చల్లాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News