Thursday, January 23, 2025

 59 పరుగులకే కుప్పకూలిన రాజస్థాన్..

- Advertisement -
- Advertisement -

 59 పరుగులకే ఆలౌట్
 112 పరుగులతో బెంగళూరు ఘన విజయం
 ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
జైపూర్ : ఐపిఎల్ చరిత్రలో రాజస్థాన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 59 పరుగులకే పేక మేడలా కుప్పకూలి ఘోరా పరాజయాన్ని చవి చూసింది. బెంగళూరు బౌలర్ల దాటికి తల్లడిల్లింది. ఒక ఇన్నింగ్స్ ఓపెనర్లిద్దరూ డకౌట్ కావడం ఇదే తొలిసారి. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించలేకపోయింది. దీంతో 112 పరుగుల తేడాతో బెంగళూరు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఒక్క సిమ్రాన్ హెట్‌మేయర్ (19 బంతుల్లో 35) పోరాట పటిమ కనబర్చినా.. మిగతా రాజస్థాన్ బ్యాటర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారు. దీంతో రజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ చిత్తు చేసింది బెంగళూరు.

మ్యాక్స్‌వెల్ మెరుపులు..
అంతకుముందు బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంకున్న బెంగళూరు. ఓపెనర్లుగా వచ్చే కోహ్లీ, డూప్లెసిస్ ఇద్దరు నిదానంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. డూ ప్లెసిస్ అప్పుడప్పుడు బౌండరీలతో ఆకట్టుకుంటున్నా, కోహ్లీ మాత్రం ఇబ్బంది పడ్డట్టూ కనిపించాడు. పరుగుల సునామీ సృష్టించాల్సిన పవర్ ప్లేలో అతడు సింగిల్స్, డబుల్స్‌తోనే సర్దుబాటు చేసుకున్నాడు. పవర్‌ప్లేలో ఈ జోడీ కేవలం 42 పరుగులే చేసింది. ఇక కోహ్లీ ఖాతా తెరవాలని అనుకున్న సమయంలో.. క్యాచ్ ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్.. వచ్చి రావడంతోనే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన 360 డిగ్రీ ఆటతో మైదానంలో కాసేపు పరుగుల వర్షం కురిపించాడు. డూ ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డూప్లెసిస్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం లామ్రోర్, దినేశ్ కార్తిక్ వెంటే పెవిలియన్ బాట పట్టారు. ఆ కొద్దిసేపటికే మ్యాక్స్‌వెల్ రివర్స్ స్వీప్ షాట్ ప్రయత్నించి, సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌల్ అయ్యాడు. చివర్లో అనూజ్ రావత్ మెరుపులు మెరిపించడంతో తద్వారా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో అసిఫ్, జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.

ఓపెనర్లిద్దరూ డకౌట్..
ప్రతి ఇన్నంగ్స్ రాజస్థాన్ జట్టుకు శుభారంభాన్నిచ్చే జైస్వాల్, బట్లర్ ఈసారి డకౌట్ అయ్యారు. కెప్టెన్ సంజూ కూడా 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం వచ్చిన జో రూట్ కూడా రాణించకపోవడం, 10 పరుగులే చేసి చేతులెత్తేశాడు. మధ్యలో సిమ్రాన్ కాస్త మెరుపులు మెరిపించినా.. ఇంతలోనే అతడు కూడా ఔట్ అయ్యాడు. ఇలా వెనువెంటనే వికెట్లు కోల్పోయి, రాజస్థాన్ 59 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు బౌలర్లలో పార్నెల్ 3 వికెట్లు, బ్రేస్‌వెల్, కరణ్ శర్మ తలో 2 వికెట్లు, మ్యాక్స్‌వెల్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News