Monday, December 23, 2024

ఉప్పల్ లో కోహ్లి వీరంగం.. ఆర్‌సిబి ఘన విజయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో బెంగళూరు తన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తరఫున హెన్రిచ్ క్లాసెన్, బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి శతకాలతో అలరించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

క్లాసెన్ 51 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో 8 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 71 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన కోహ్లి 63 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 12 ఫోర్లతో 100 పరుగులు సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News